HCL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 84 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

HCL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Hindustan Copper Limited

Updated on: Oct 18, 2022 | 8:36 AM

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 84 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్-2021, 2022లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఇతర అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, గేట్‌ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మైనింగ్‌ ఖాళీలు: 2
  • సర్వే ఖాళీలు: 6
  • జియోలజీ ఖాళీలు: 6
  • ఎలక్ట్రికల్ ఖాళీలు: 11
  • కాన్‌సెంట్రేటర్‌ ఖాళీలు: 6
  • సివిల్‌ ఖాళీలు: 5
  • మెకానికల్‌ ఖాళీలు: 12
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఖాళీలు: 2
  • సిస్టమ్‌ ఖాళీలు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us