National career service: ఉద్యోగం కావాలా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి

|

Mar 28, 2023 | 4:30 PM

కేంద్ర ప్రభుత్వం కూడా జాబ్‌ కోసం వెతికే వాళ్లకు, జాబ్‌ ఇచ్చే వాళ్లకు వారధిగా ఒక జాబ్‌ పోర్టల్‌ రూపొందించింది. కేంద్ర కార్మిక శాఖ నిర్వహించే ఈ వెబ్ పోర్టల్ పేరు నేషనల్ కెరీర్ సర్వీస్.

National career service: ఉద్యోగం కావాలా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి
Job Search
Follow us on

ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు సాధారణంగా ప్రైవేటు ఆన్ లైన్ పోర్టల్స్ లో రిజిస్టర్ చేసుకుంటారు. అంటే నౌకరీ, మానస్టర్ వంటి ప్రైవేటు ప్లాట్ ఫామ్స్ లో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేస్తే వేలకొలదీ జాబ్స్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ప్రైవేటు పోర్టల్స్. మరీ ప్రభుత్వం ద్వారా నడిచే ఇలాంటి పోర్టల్ ఏమైనా ఉందా? ఉంటే బాగుండు కదా అనుకొంటున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ కథనం. కేంద్ర ప్రభుత్వం కూడా జాబ్‌ కోసం వెతికే వాళ్లకు, జాబ్‌ ఇచ్చే వాళ్లకు వారధిగా ఒక జాబ్‌ పోర్టల్‌ రూపొందించింది. కేంద్ర కార్మిక శాఖ నిర్వహించే ఈ వెబ్ పోర్టల్ పేరు నేషనల్ కెరీర్ సర్వీస్. ఉద్యోగార్థులకు, ఉద్యోగుల కోసం చూసే కంపెనీలకు వారధిగా ఉంటూ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఇందులో 9,72, 798 కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా పోర్టల్ 3,73, 956 ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.

ఏం ఉద్యోగాలు ఉంటాయి..

ఈ పోర్టల్ లో ప్రభుత్వ ఉద్యోగాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండే పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల వివరాలు తెలుస్తాయి. ఇది ఉద్యయం, ఈ శ్రమ్ వంటి పోర్టల్స్ తో అనుసంధామనమై పనిచేస్తుంది.

ఎలా రిజస్టర్ చేసుకోవాలంటే..

  • ఎన్సీఎస్ పోర్టల్ లో కి వెళ్లాలి.
  • పేజ్ ఓపెన్ కాగానే కుడి చేతి వైపు లాగిన్ బాక్స్ ఉంటుంది. దానిలో సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో రిజిస్టర్ ఆజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో జాబ్ సీకర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. దానిలో వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా యూఏఎన్ నంబర్లను పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ విజయవంతం అయితే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. దానిని వెరిఫై చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ఎలా..

  • పోర్టల్ లో లాగిన్ అయ్యాక కింద ‘View/Update NCS Profile’ ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద ‘Search Job’ బటన్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు వచ్చిన కీ వర్డ్, లోకేషన్, ఎక్స్ పెక్టెడ్ శాలరీ, ఆర్గనైజేషన్ టైప్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల జాబితా కనిపిస్తుంది.
  • వాటిల్లో మీకు ఆసక్తి ఉన్న జాబ్ వద్ద ఉన్న అప్లై బటన్ పై క్లిక్ చేస్తే చాలు.
  • అలాగే ఉద్యోగార్థులకు జాబ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.

సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: 1514

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.