HAL Teacher Jobs 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 21 టీచర్ ఉద్యోగాలు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హిందుప్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ సొసైటీ, బెంగళూరు 2022-23 విద్యా సంవత్సరానికి గాను టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

HAL Teacher Jobs 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 21 టీచర్ ఉద్యోగాలు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
Hal Bengaluru
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2022 | 8:34 AM

HAL Bengaluru Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ సొసైటీ (Hindustan Aeronautics Limited), బెంగళూరు 2022-23 విద్యా సంవత్సరానికి గాను టీచింగ్, నాన్ టీచింగ్ ( Teaching Non Teaching posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 21

పోస్టుల వివరాలు:

  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ): 9
  • ప్రైమరీ టీచర్లు: 9
  • నర్సరీ టీచర్లు: 3

విభాగాలు: కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ , నర్సరీ

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ. 33,500 నుంచి రూ.61,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.250

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

HMT Jobs 2022: ఇంజనీరింగ్ డిప్లొమాతో నెలకు రూ. 23 వేలు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!