India Post Recruitment 2022: టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలు..తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..

|

May 05, 2022 | 8:02 PM

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం.. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

India Post Recruitment 2022: టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలు..తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..
India Post
Follow us on

India Post GDS Recruitment 2022: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం.. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 38,926 

పోస్టుల వివరాలు:

  • బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (BPM) పోస్టులు
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ABPM) పోస్టులు
  • డాక్‌ సేవక్‌ పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

  • తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు: 1226
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోస్టులు: 1716

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్:

  • బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000లవరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఏబీపీఎం పోస్టులకు నెలకు రూ.10,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

GAIL Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో మెడికల్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..