రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల (Volunteer Jobs) భర్తీకి ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. కాగా ఇది వరకు మండల, పట్టణాలను యూనిట్‌గా తీసుకుని వాలంటీర్లను నియమించారు. ఈసారి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని వాలంటీర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం గ్రామాల్లో 4213, పట్టణాల్లో 3005 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా చోట్ల వాలంటీర్లు లేకపోవడంతో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ మందకోడిగా సాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
కాగా ఇప్పటినుంచి వాలంటీర్ ఖాళీల భర్తీకి నెలలో రెండుసార్లు జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఖాళీల వివరాలను ప్రతినెలా 1,16వ తేదీల్లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు.. జాయింట్ కలెక్టర్లకు తెలియజేస్తూ ఉండాలి. ఇక సరైన కారణం లేకుండా వరుసగా మూడు రోజుల పాటు విధులకు హాజరుకాని వాలంటీర్లను తొలగించనున్నట్లు ఉత్తర్వు్లో పేర్కొంది. ఏడో రోజున వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లు అధికారులు నోటిఫై చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఇక గతంలో లాగే వాలంటీర్ల నియామకంలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. భారత్ వైఖరి వెనుక వ్యూహం ఇదేనా..?