AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS కావాలనుకునే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థులకు జీఆర్‌ ఐఏఎస్‌ అకాడమీ శుభవార్త అందించింది. GR SET-2026 స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన టాప్ 40 మహిళలకు రూ.1.45 లక్షల విలువైన ఒక సంవత్సరం ఉచిత UPSC కోచింగ్‌, మెంటార్‌షిప్‌ అందించనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ రోజు ముగింపు గడువులోగా ఈ కింది నెంబర్ కు వెంటనే కాల్ చేయండి..

IAS కావాలనుకునే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
GR SET Free UPSC Coaching
Srilakshmi C
|

Updated on: Jul 02, 2026 | 6:16 PM

Share

హైదరాబాద్‌, జూలై 2: సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న మహిళా అభ్యర్థులకు హైదరాబాద్‌లోని జీఆర్‌ ఐఏఎస్‌ అకాడమీ తీపికబురు చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా GR SET-2026 (Scholarship Eligibility Test) పేరుతో స్కాలర్‌షిప్ అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన మహిళా అభ్యర్థులకు ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్‌తో పాటు మెంటార్‌షిప్ అందించనుంది. అకాడమీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.1.45 లక్షల విలువైన ఒక సంవత్సరం ఆఫ్‌లైన్ యూపీఎస్సీ కోచింగ్‌, మెంటార్‌షిప్‌ కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే టాప్ 40 మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నారు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

అభ్యర్థులకు పరీక్షకు 10 రోజుల ముందు ప్రత్యేకంగా రూపొందించిన 50 పేజీల స్టడీ బుక్‌లెట్‌ను అందజేస్తారు. స్కాలర్‌షిప్ అర్హత పరీక్షలో వచ్చే అన్ని ప్రశ్నలు ఈ బుక్‌లెట్‌లోని అంశాల నుంచే ఉంటాయి. దీంతో యూపీఎస్సీపై ముందస్తు అవగాహన లేకపోయినా, కొత్తగా సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కూడా సమాన అవకాశంతో పోటీ పడవచ్చని అకాడమీ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా టాప్ 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే సమగ్ర ఆఫ్‌లైన్ యూపీఎస్సీ కోచింగ్ బ్యాచ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర సామాజిక కారణాల వల్ల యూపీఎస్సీ లక్ష్యాన్ని వదులుకోవాల్సి వస్తున్న మహిళలకు ఈ స్కాలర్‌షిప్ మంచి అవకాశంగా నిలుస్తుందని జీఆర్‌ ఐఏఎస్‌ అకాడమీ పేర్కొంది. దేశ భవిష్యత్ మహిళా పరిపాలనా నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు, డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు, ఉద్యోగ అనుభవం ఉన్న మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు గురువారం (జులై 2, 2026) చివరి తేదీ. మరికొన్ని గంటల వరకు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. స్కాలర్‌షిప్ పరీక్ష జూన్ 7, 2026న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్: 90633 45568 లేదా అధికారిక వెబ్‌సైట్ www.griasacademy.comను సందర్శించండి.

పరీక్షా కేంద్రం

GR IAS Academy, పిల్లర్ నెం. 41, అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్ సమీపంలో, హైదరాబాద్.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!