GGH Kadapa Recruitment 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో..కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు..రేపే ఆఖరు!

|

May 24, 2022 | 9:29 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం (GGH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌ఓ తదితర (Radiation Safety Officer Posts) పోస్టుల..

GGH Kadapa Recruitment 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో..కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు..రేపే ఆఖరు!
GGH Vijayawada
Follow us on

Kadapa Govt General Hospital Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం (GGH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌ఓ తదితర (Radiation Safety Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్‌, ఎఫ్‌ఎన్‌ఓ, ఈసీజీ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, ఓటీ అసిస్టెంట్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ కార్యాలయం, కడప, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.