Gaming Industry: గేమింగ్‌ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు.. రానున్న రోజుల్లో మరింత వృద్ధి

|

Nov 18, 2022 | 10:48 AM

ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్‌తో సహా డొమైన్‌లలో గేమింగ్ పరిశ్రమ 2022-23 నాటికి లక్ష కొత్త ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని ఒక నివేదిక..

Gaming Industry: గేమింగ్‌ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు.. రానున్న రోజుల్లో మరింత వృద్ధి
Gaming Industry
Follow us on

ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్‌తో సహా డొమైన్‌లలో గేమింగ్ పరిశ్రమ 2022-23 నాటికి లక్ష కొత్త ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. రానున్న ఏడాదిలో భారతదేశంలో గేమింగ్‌ పరిశ్రమ 20-30 శాతం వృద్ధి చెందనుంది. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష కొత్త ఉద్యోగ నియమాకాలు జరగనున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రంగం దాదాపు 50,000 మంది వ్యక్తులకు నేరుగా ఉపాధి కల్పిస్తోంది. వీరిలో 30శాతం మంది వర్క్‌ఫోర్స్‌ ప్రోగ్రామర్లు, డెవలపర్లుగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ రంగంలో ప్రోగ్రామింగ్‌, గేమ్స్‌ టెస్ట్‌ ఇంజనీరింగ్‌, క్వాలిటీ అండ్‌ అస్యూరెన్స్‌ లేదా క్యూఏ లీడ్‌, యానిమేషన్‌, మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనర్లు వంటి డొమైన్‌లలో కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేదా వీఎఫ్‌ఎక్స్‌, కాన్సెప్ట్‌ ఆర్టిస్టులు, కంటెంట్‌ రైటర్‌లు, గేమింగ్‌ జర్నలిస్టులు, వెబ్‌ అనలిస్ట్‌ల రూపంలో వేలాది కొలువులు రానున్నాయి.

వేతనాల విషయంలో గేమింగ్‌ పరిశ్రమ మెరుగైన వృద్ధితో దూసుకెళ్తోంది. గేమింగ్‌ పరిశ్రమలో అత్యధిక చెల్లింపు ప్రొఫైల్‌లలో గేమ్‌ నిర్మాతలు (రూ.10 లక్షలు), గేమ్‌ డిజైనర్లు (రూ 6.5 లక్షలు), సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు (రూ 5.5 లక్షలు), గేమ్‌ డెవలపర్‌లు (రూ 5.25 లక్షలు), క్యూఎ టెస్టర్లు (రూ 5.11 లక్షలు) ఉన్నారు. తరచూ మార్పుల కారణంగా కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో గేమింగ్‌ పరిశ్రమ 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2026 నాటికి 2.5రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు టీమ్‌లీజ్‌ డిజిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ చెమ్మన్‌కోటిల్‌ అన్నారు. ఈ పరిశ్రమ 2023 నాటికి 20-30శాతం వృద్ధి చెందుతుంది. 2026 నాటికి గేమింగ్‌ పరిశ్రమ మార్కెట్‌ విలువ రూ. 38,097 కోట్లకు చేరుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి