AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

Telangana Anganwadi Recruitment 2026: మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గద్వాల, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. స్థానిక మహిళలకు మంచి అవకాశంగా నిలుస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు..

గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు
Telangana Anganwadi Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 29, 2026 | 6:38 PM

Share

అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో గద్వాల్, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

పోస్టుల వివరాలు..

  • గద్వాల్ ప్రాజెక్టు: 33 పోస్టులు (టీచర్లు 28, హెల్పర్లు 5)
  • మల్దకల్ ప్రాజెక్టు: 26 పోస్టులు (టీచర్లు 22, హెల్పర్లు 4)
  • మనోపాడ్ ప్రాజెక్టు: 14 పోస్టులు (టీచర్లు 14, హెల్పర్లు 0)

అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అయితే హెల్పర్ పోస్టులకు అర్హులైన ఇంటర్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 10వ తరగతి ఉత్తీర్ణులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ నియామకాల్లో కేవలం స్థానిక మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే వారు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో నివసించే వారు మాత్రమే అర్హులు. గిరిజన తండాలు, గూడేలు, ఆవాసాల్లోని పోస్టులకు సంబంధిత ఎస్టీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అలాగే ఎస్సీ వాడల పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జులై 8, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది.

ఎంపిక విధానంలో మార్కుల వెయిటేజీ ఇలా..

  • ఇంటర్వ్యూ: 10 మార్కులు
  • ఇంటర్ మార్కులకు: 70% వెయిటేజీ

అదనపు వెయిటేజీ ఈ కింది విధంగా కేటాయిస్తారు..

ఇవి కూడా చదవండి
  • వితంతువులకు 5%
  • అనాథలకు 10%
  • దివ్యాంగులకు 5%

దరఖాస్తు సమయంలో ఈ క్రింది పత్రాలు అప్‌లోడ్ చేయాలి

  • జనన ధ్రువీకరణ / వయసు ధ్రువీకరణ
  • కుల ధ్రువీకరణ పత్రం
  • విద్యార్హత మార్కుల మెమోలు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్
  • వితంతువులైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  • అనాథలైతే అనాథ ధ్రువీకరణ పత్రం

Follow Us