ESIC Recruitment 2021-22 : ఈఎస్ఐసిలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

|

Dec 28, 2021 | 5:45 PM

ESIC Recruitment 2021-22 : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 27 వేరు వేరు విభాగాల్లో 3,846 ఉద్యోగాల..

ESIC Recruitment 2021-22 : ఈఎస్ఐసిలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
Follow us on

ESIC Recruitment 2021-22 : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 27 వేరు వేరు విభాగాల్లో 3,846 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదలైంది. వీటిలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించిన ప్రకటను ఇవాళ విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 15, 2022 నుండి ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 15, 2022 చివరి తేదీగా ప్రకటించారు.

ముఖ్యమైన వివరాలు..
మొత్తం ఖాళీలు : 3,846 (అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్)
అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : జనవరి 15, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 15, 2022

విద్య అర్హతలు..
అప్పర్ డివిజనల్ క్లర్క్: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం లేదా తత్సమాన గ్రాడ్యూయేషన్ కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి.
స్టెనోగ్రాఫర్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత, తత్సమాన విద్యార్థత కలిగి ఉండాలి.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డు నుండి మెట్రిక్యులేషన్, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

నైపుణ్య పరీక్ష..
స్కిల్ టెస్ట్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా కింది నైపుణ్యాలను కలిగి ఉండాలి
డిక్టేషన్ : 10 నిమిషాలు, నిమిషానికి 80 పదాలు.
ట్రాన్సిలేషన్ : 50 నిమిషాలు (ఇంగ్లీష్), 65 నిమిషాలు (హిందీ) (కంప్యూటర్లలో మాత్రమే).

వయో పరిమితి (15/02/2022 నాటికి):
అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:
అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కేటగిరీల వారీగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, డిపార్ట్‌మెంట్, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ ఫీజులు రూ. 250గా నిర్ణయించారు. జనరల్ అభ్యర్థులందరూ రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

Also read:

Andrew tye: రెండు బంతులు అలా వేశాడు అంతే.. మిగతా ఓవర్లు వేయకుండా నిషేధం విధించారు..

బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన కమలం..

Fact Check: వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న రూ.500 నకిలీ నోటు.. ఇందులో నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో