
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1979 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 675 ఖాళీలకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎడ్‌లతో అవకాశం ఉంది. సాధారణంగా టీచర్ ఉద్యోగాలకు డీఎడ్ లేదా బీఎడ్ తప్పనిసరిగా ఉండాలి. కానీ కంప్యూటర్ సైన్స్ టీచర్లకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. దీంతో బీఎడ్ అర్హత లేకుండానే నేరుగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) కంప్యూటర్ సైన్స్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ, బీసీఏ, బీటెక్/ బీఈలో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అలాగే ఏదైనా నాన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో పాటు డీవోఈఏసీసీ (ప్రస్తుత నీలిట్) నుంచి ఏ లెవెల్ కోర్సు పూర్తిచేసిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా పొందొచ్చు.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డీఎడ్,స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్ లేదా బీఎడ్ (జనరల్), రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ), డిప్లొమా లేదా పీజీ డిప్లొమా, డొమెస్టిక్ సైన్స్/ హోమ్ సైన్స్‌తో డిగ్రీ, ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్/ ఫోరెన్సిక్ సైన్స్/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ జువాలజీ/ బోటనీ/ మైక్రోబయాలజీ/ ఆంత్రొపాలజీ/ బయాలజీ/ హ్యూమన్ బయాలజీ/ లైఫ్ సైన్స్/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ జెనెటిక్స్/ బయోటెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/ ఫోరెన్సిక్ సైన్స్/ కెమిస్ట్రీ/ టాక్సికాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఫోరెన్సిక్ సైన్స్‌తో మాస్టర్స్ డిగ్రీ, ఇంటర్మీడియట్, బీఈ/ బీటెక్ అర్హతతోపాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు ఇతర స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 సంవత్సరాలు మించకూడదు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో జులై 15, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు ఉండదు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో అర్హతకు జనరల్/ ఈడబ్ల్యూఎస్‌లు 40 శాతం, ఓబీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 30 శాతం మార్కులు పొందాలి. ఎంపికైన వారికి రూ.25,500 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.