DRDO – DMSRDE Kanpur Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్‌లోని డీఆర్‌డీఓ-డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE).. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో (Research Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
విభాగాలు: మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రీసెర్చ్ అసోసియేట్లకు నెలకు రూ.54,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్/యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
అడ్రస్: DRDO- DMSRDE, జీటీ రోడ్, కాన్పూర్-208004.
ఇంటర్వ్యూ తేదీ: 2022, మే 5,6 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: