DMHO West Godavari Jobs: టెన్త్/ఐటీఐ అర్హతతో.. పశ్చిమ గోదావరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

|

Aug 13, 2022 | 6:51 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (DMHO West Godavari).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 237 మెడికల్ స్టాఫ్‌ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన..

DMHO West Godavari Jobs: టెన్త్/ఐటీఐ అర్హతతో.. పశ్చిమ గోదావరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
Dmho West Godavari
Follow us on

DMHO West Godavari Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (DMHO West Godavari).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 237 మెడికల్ స్టాఫ్‌ పోస్టుల (Para Medical Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్‌ క్లాస్, పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఇంటర్మీడియట్/ఎసీఏ/బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/బీఎస్సీ/డిప్లొమా/డీఫార్మసీ/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్సీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.37,640ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శంచవచ్చు.

ఖాళీల వివరాలు:

  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 9
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 9
  • ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు: 10
  • శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 13
  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 3
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 11
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 11
  • ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులు: 6
  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 2
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 08
  • ప్లంబర్ పోస్టులు: 5
  • అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 10
  • ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 1
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 3
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 4
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 10
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 53
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్/ అసిస్టెంట్ పోస్టులు: 2
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 11
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 15
  • లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 4
  • మార్చురీ అటెండెంట్ పోస్టులు: 5
  • ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 5
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 8
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 6
  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
  • ప్లంబర్ పోస్టులు: 3
  • స్టోర్ అటెండర్ పోస్టులు: 4

అడ్రస్: District Medical and Health Office, Eluru, West Godavari District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.