AP Job Recruitment 2021: ఏపీ డీఎంఈ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. దరఖాస్తుకు గడువు ఇంకా ఒకరోజు మాత్రమే..!

| Edited By: Phani CH

Dec 08, 2021 | 9:15 AM

AP Job Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న..

AP Job Recruitment 2021: ఏపీ డీఎంఈ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. దరఖాస్తుకు గడువు ఇంకా ఒకరోజు మాత్రమే..!
Follow us on

AP Job Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా 326 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకునేందుకు ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. అంటే డిసెంబర్‌ 9 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

పోస్టులు- అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య- 326
విభాగాలు- ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో..
విద్యార్హత- సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎన్‌బీ /ఎంబీబీఎస్‌తోపాటు ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అలాగే క్లినికల్‌ స్పెషలైజేషన్స్‌కి సీనియర్‌ రెసిడెన్సీ తప్పనిసరిగా ఉండాలి.
వయసు- 23.11.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు. వేతనం రూ.92 వేల వరకు చెల్లించే అవకాశం. అలాగే పీజీ, డిగ్రీ పరీక్షల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Defence Jobs: డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Andhrapradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మెడికల్‌ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..