SSC Delhi Constable Jobs: కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. జనవరి 13 నుంచి

|

Jan 10, 2024 | 9:51 PM

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఘట్టమైన శారీరక సామర్థ్య పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలను తాజాగా కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలోని అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ అధికారిక ప్రకటన విడుదల..

SSC Delhi Constable Jobs: కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. జనవరి 13 నుంచి
SSC Delhi Constable
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 10: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఘట్టమైన శారీరక సామర్థ్య పరీక్షలు త్వరలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలను తాజాగా కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలోని అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైబ్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. కాగా కానిస్టేబుల్‌ కొలువులకు నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు రాత పరీక్షలు జరగ్గా, డిసెంబర్‌ 31న ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

మొత్తం 85,867 మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించగా.. వీరంతా శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరుకానున్నట్లు ఎస్సెస్సీ ప్రకటించింది. జనవరి 13 నుంచి 20వ తేదీ వరకు వీరికి ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్ (పీఎంటీ)లను నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7,547 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అన్ని దశల్లో ప్రతిభకనబరచి ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీత భత్యాలు చెల్లిస్తారు.

జనవరి 20తో ముగుస్తోన్న తెలంగాణ గురుకుల్లో అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ గురుకుల సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రకటన వెలువరించారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నారు. పరీక్ష రోజున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 643 గురుకులాలు ఉండగా.. వాటిల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బాలికలకు 353 గురుకులాలు, బాలురకు 290 గురుకులాలు అందుబాటులో ఉన్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 18,560 సీట్లు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 6,560 సీట్లు, బీసీ సంక్షేమ గురుకులాల్లో 23,680 సీట్లు, సాధారణ సొసైటీ గురుకులాల్లో 3,124 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు తమ బోనఫైడ్‌ లేదా స్టడీ సర్టిఫికెట్‌ను దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.