Central University Of Kerala Faculty Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ (CU- Kerala).. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Teaching Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: టీచింగ్ స్టాఫ్ పోస్టులు
ఖాళీల వివరాలు: ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొపెసర్-9
విభాగాలు: జువాలజీ, కెమిస్ట్రీ, హిందీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటిక్స్ తదితర విభాగాలు
పే స్కేల్: నెలకు రూ.57,700ల నుంచి రూ.1,44,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
హార్డ్ కాపీలను పంపవల్సిన చిరునామా: The Recruitment Cell, Central University of Kerala, Tejaswini Hills, Periye, Kasaragod-671320.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: