CSIR – CIMFR Recruitment 2022: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 68
ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 38
ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 30
పే స్కేల్: నెలకు రూ.28,000 జీతంగా చెల్లిస్తారు. గేట్/సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఉన్న అభ్యర్ధులకు నెల జీతం రూ.35,000 చెల్లిస్తారు.
అర్హతలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్) కనీసం 65% మార్కులతో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలి.
ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో కనీసం 65% మార్కులతో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు, 2022. ఈ తేదీల్లో CSIR Central Institute of Mining and Fuel Research, Bilaspur Research Centre Campus, Post-Kholi Chowk, Bilaspur, Chattisgarh నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: