Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Nov 09, 2021 | 3:40 PM

Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కొచ్చిలో ఉన్న మినీ రత్న కంపెనీ అయిన ఈ సంస్థలో వివిధ ట్రేడ్‌ల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను తీసుకోనున్నారు...

Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Cochin Shipyard Recruitment
Follow us on

Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కొచ్చిలో ఉన్న మినీ రత్న కంపెనీ అయిన ఈ సంస్థలో వివిధ ట్రేడ్‌ల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 355 అప్రెంటిస్‌ పోస్టలను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు (347), టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు (08) ఖాళీలు ఉన్నాయి.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌ల్లో భాగంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థులు 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి.

* టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లో భాగంగా అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్, బేసిక్‌ నర్సింగ్‌ అండ్‌ పల్లియేటివ్‌ కేర్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలున్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఒకేషనల్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(వీహెచ్‌ఎస్‌ఈ) ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థులు 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికనైన వారికి నెలకు రూ. 9000 స్టయిపెండ్ చెల్లిస్తారు.

* టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 8000 స్టయిపెండ్‌గా చెల్లిస్తారు.

* అభ్యర్థులను సంబంధిత విద్యార్హతలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 10-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: JC Prabhakar Reddy: రూట్ మార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈసారి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి..

Covid Vaccine Lottery: కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. అదృష్టం వరించింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది..

Hobby: హాబీ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? కొన్నిరకాల హాబీల గురించి తెలుసుకుందాం రండి!