CLAT 2025 Admitcard: క్లాట్‌ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌

|

Nov 15, 2024 | 2:18 PM

న్యాయ విద్యాలో ఉన్నత చదువులు చదవాలనుకునేవారి కోసం యేటా క్లాట్ ప్రవేశ పరీక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష త్వరలోనే దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ విడుదల చేసింది.. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

CLAT 2025 Admitcard: క్లాట్‌ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌
CLAT 2025 Admitcard
Follow us on

న్యూఢిల్లీ, నవంబర్‌ 15: దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో ‘లా’ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2025 పరీక్ష సమీపిస్తోంది. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2025కు సంబంధించిన అడ్మిట్‌కార్డులు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. అనంతరం వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ వెల్లడించింది.

ఇక క్లాట్‌ 2025 ప్రవేశ పరీక్ష ఈ ఏడాది డిసెంబర్‌ 1 (ఆదివారం)వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ (CNLUs) వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 1వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని ఇండియన్‌ లా కోర్సులకు కలిపి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ, కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది.

నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ ప్రోగ్రాం (ఎల్‌ఎల్‌బీ), పీజీ డిగ్రీ ప్రోగ్రాం (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూజీ కోర్సులకు 10+2, పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

క్లాట్‌ 2025 అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.