BSIP Recruitment 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.92 వేల జీతంతో ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇవే..

|

Aug 10, 2022 | 8:03 AM

కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలోనున్న బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్ (BSIP)... 24 టెక్నికల్ అసిస్టెంట్-ఎ, టెక్నికల్ అసిస్టెంట్-డి, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ..

BSIP Recruitment 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.92 వేల జీతంతో ఉద్యోగాలు.. అర్హతలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇవే..
Bsip Lucknow
Follow us on

BSIP lucknow Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలోనున్న బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్ (BSIP)… 24 టెక్నికల్ అసిస్టెంట్-ఎ, టెక్నికల్ అసిస్టెంట్-డి, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీ లైబ్రరీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ/ఇంగ్లిష్‌లో స్పీడ్‌ టైపింగ్‌ వచ్చి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 28, 2022లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/టైప్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్ధులకు పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.