BSF ASI Stenographer and HC Ministerial Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF).. 323 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) పోస్టులు 11, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు 312 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ (10+2)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యండ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వీటితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలుండాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 6, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్స్, షార్ట్‌హ్యండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారు నెలకు రూ.25,500ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం:
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.