Student Credit Card: రూపాయి వడ్డీకే రూ. 4 లక్షల రుణం.. విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం బంపరాఫర్‌..

|

Dec 05, 2022 | 11:06 AM

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించని నేపథ్యంలో చాలా మంది చదువులకు దూరమవుతుంటారు. మరీ ముఖ్యంగా పై చదువుల విషయంలో ఫీజులు చెల్లించలేక తమ కలలను నెరవేర్చుకోలేపోతుంటారు. ఇలాంటి వారి కోసమే బిహార్‌ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది...

Student Credit Card: రూపాయి వడ్డీకే రూ. 4 లక్షల రుణం.. విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం బంపరాఫర్‌..
Loan For Students
Follow us on

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించని నేపథ్యంలో చాలా మంది చదువులకు దూరమవుతుంటారు. మరీ ముఖ్యంగా పై చదువుల విషయంలో ఫీజులు చెల్లించలేక తమ కలలను నెరవేర్చుకోలేపోతుంటారు. ఇలాంటి వారి కోసమే బిహార్‌ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో విద్యార్థుల పై చదువులకు సమయానికి డబ్బులు అందుతాయి. ఈ పథకంలో భాగంగా విద్యార్థులు సులభంగా రూ. 4 లక్షల వరకు రుణం పొందొచ్చు. 12వ తరగతితో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పథకానికి అర్హులు.

12వ తరగతి పూర్తి చేసి పై చదువులకు వెళ్లలేక ఇబ్బంది పడే వారి కోసం బిహార్‌ ప్రభుత్వం. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణం అందిస్తోంది. బ్యాంకులు అందంచే స్టడీ లోన్స్‌తో పోల్చితే చాలా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తారు. ఈ పథకం కింద విద్యార్థులు కేవలం 1 శాతం వడ్డీకే రుణాలను పొందే వెసులుబాటును కల్పించారు. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.

ఈ వెబ్‌సైట్‌లో ఉండే అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని. అనంతం నింపిన ఫామ్‌ను జిల్లా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఉన్నత విద్యా ధృవీకరణ పత్రం, విద్యార్థి, తల్లిదండ్రుల ఫోటో, విద్యా ధృవీకరణ పత్రం, బ్యాంక్ వివరాలు వంటి వాటిని సమర్పించాలి. వీటితో పాటు బిహార్‌ రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. విద్యార్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇలాంటి పథకం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది కదూ!

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..