Bihar: పేదింటి చదువుల సరస్వతికి సాయంగా ఊరే కదిలింది..

కలలను నెరవేర్చుకోవడానికి.. ఆకాశం దాకా ఎగరడానికి రెక్కలు కావాలి. ఈ విద్యార్ధికి ఆ రెండు రెక్కలు అమ్మ, అమ్మమ్మలయ్యారు. వీరి సహాయంతో పదో తరగతి పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచి.. ఎక్కడో మారుమూలనున్న బాలిక..

Bihar: పేదింటి చదువుల సరస్వతికి సాయంగా ఊరే కదిలింది..
Priyanshu Kumari

Updated on: Apr 16, 2022 | 10:02 PM

Bihar Board 10th Topper Priyanshu Kumari story in Telugu: కలలను నెరవేర్చుకోవడానికి.. ఆకాశం దాకా ఎగరడానికి రెక్కలు కావాలి. ఈ విద్యార్ధికి ఆ రెండు రెక్కలు అమ్మ, అమ్మమ్మలయ్యారు. వీరి సహాయంతో పదో తరగతి పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచి.. ఎక్కడో మారుమూలనున్న బాలిక ఊరు పేపర్‌లో పడింది. ఎవరీ చదువుల సరస్వతి అని సర్వత్రా ఆరా తీయడంతో.. చదువుల తల్లి ప్రతిభతోపాటు.. పేదరికం కూడా వెలుగులోకొచ్చింది. దీంతో ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..

ప్రియాన్షు కుమారి.. బీహార్‌ రాష్ట్రంలోని జెహానాబాద్‌ జిల్లా, సుమేరా గ్రామానికి చెందిన ప్రియాన్షు కుమారి చిన్నతనంలోనే తండ్రి కౌశలేంద్రను కోల్పోయింది. కొన్ని రోజులకే తాత కూడా కాలంచేశాడు. ఈ విధంగా కుటుంబ పెద్దలను కోల్పోవడంతో సంపాదన కరువైంది. ప్రియాన్షు తల్లి శోభాదేవి, అమ్మమ్మ సుమిత్రా ఇద్దరూ కూలీలుగా మారి జీవనం సాగిస్తూ.. ప్రియన్షు, ఆమె సోదరిని చదివిస్తున్నారు.

బీహార్‌ రాష్ట్ర పదో తరగతి పరీక్షల్లో 472 మార్కులతో ఈ ఏడాది టాపర్‌గా నిలిచిన ప్రియాన్షు ఆర్థిక సమస్యల కారణంగా పై చదువులు కొనసాగించలేని పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత ఆమె పేరు జెహానాబాద్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో బాలిక పేదరికం కూడా వెలుగులోకొచ్చింది.

సంతోష్‌ కుమార్‌ అనే రిటైర్డ్‌ సైనికాధికారి బాలిక చదువు నిమిత్తం ఆమె కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న సుమేరా గ్రామస్థులు మేమున్నామంటూ ముందుకొచ్చి, బాలిక చదువు బాధ్యతలను తీసుకున్నారు. గ్రామస్థులందరూ కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రియాన్షు కుమారి చదువు బాధ్యతలను ఆ కమిటీ చేసుకుంటుందన్నామాట. దీనితో ప్రియాన్షు కలలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

ఈ సందర్భంగా ప్రియాన్షు మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారి అవ్వడం తన చిన్ననాటి కల అని, ఐతే ఇప్పుడు అది తన కల కాదని, తన గ్రామస్థులందరి కలని సంతోషంతో తెల్పింది.

Also Read:

PGIMER Recruitment 2022: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో 93 ఉద్యోగాలు.. నెలకు 67 వేల జీతంతో..