BEE Recruitment: ఇంజనీరింగ్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేల జీతం..

|

Jun 04, 2022 | 10:25 AM

BEE Recruitment 2022: ఇంజనీరింగ్ పూర్తి చేసి వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే సదవకాశం. ఢిల్లీలో ఉన్న బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

BEE Recruitment: ఇంజనీరింగ్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేల జీతం..
Follow us on

BEE Recruitment 2022: ఇంజనీరింగ్ పూర్తి చేసి వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే సదవకాశం. ఢిల్లీలో ఉన్న బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాసత్ఉ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్/ మెకానికల్‌/ కెమికల్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం రాత పరీక్ష, పర్సనల్ ఇంటరాక్షన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 జీతంగా చెల్లిస్తారు.

* దరరఖాస్తుల స్వీకరణ 04-06-2022న మొదలై 04-07-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..