BECIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో జాబ్‌ ఆఫర్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 22 అసిస్టెంట్‌ డైటీషియన్‌, పర్‌ఫ్యూషనిస్ట్‌, లైబ్రేరియన్‌ పోస్టుల (Assistant Dietitian Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

BECIL Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో జాబ్‌ ఆఫర్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Becil

Updated on: Sep 14, 2022 | 4:16 PM

BECIL Assistant Dietitian Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 22 అసిస్టెంట్‌ డైటీషియన్‌, పర్‌ఫ్యూషనిస్ట్‌, లైబ్రేరియన్‌ పోస్టుల (Assistant Dietitian Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 29, 2022వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌/స్కిల్‌ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,970ల నుంచి రూ.26,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.