
Bank of Baroda Recruitment 2026: మంచి జీతంతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) 1,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నియామక ప్రక్రియలో మొత్తం 1,100 ఖాళీలు ఉన్నాయి. వీటిలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) పోస్టులు 1,000, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II) పోస్టులు 100 ఉన్నాయి.
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత సర్టిఫికేషన్ ఉండాలి. వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్‌లో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా MBA (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాంకింగ్) అర్హత ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవం అవసరం.
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2026 సెప్టెంబర్ 1 నాటికి 22–32 ఏళ్లు, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు 21–33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది.
క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు నెలకు రూ.64,820–రూ.93,960, వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.48,480–రూ.85,920 వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
అభ్యర్థుల ఎంపిక అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్‌లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి.
అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.850, SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబర్ 4, 2026.
దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.