గణేశుని 8 ప్రధాన అవతారాలు ఏంటి? ఏ రాక్షసుడిని ఏ అవతారంలో సంహరించారంటే..
12 September 2026
Rajashekher
మత్సరాసురుడి అసూయ, అహంకారం, దౌర్జన్యాన్ని అంతం చేయడానికి గణేశుడు వక్రతుండ రూపాన్ని ధరించాడని పురాణ కథనం.
వక్రతుండ అవతారం:
మాదాసురుడి అహంకారం, అధికార దుర్వినియోగాన్ని అణచివేసేందుకు గణేశుడు ఏకదంత రూపంలో అవతరించాడని చెబుతారు.
ఏకదంత అవతారం:
మోహాసురుడి భ్రమ, మాయ ప్రభావాన్ని తొలగించేందుకు గణేశుడు మహోదర అవతారం ధరించాడని ముద్గల పురాణం వివరిస్తుంది.
మహోదర అవతారం:
లోభాసురుడి దురాశను, మితిమీరిన కోరికలను అణచివేసేందుకు గణేశుడు గజానన రూపాన్ని ధరించాడని కథనం.
గజానన అవతారం:
క్రోధాసురుడి కోపం, దౌర్జన్యాన్ని అంతం చేసేందుకు గణేశుడు లంబోదర రూపంలో అవతరించాడని చెబుతారు.
లంబోదర అవతారం:
కామాసురుడికి ప్రతీకగా భావించే అదుపులేని కోరికలు, కామ వాంఛలను నియంత్రించేందుకు గణేశుడు వికట రూపాన్ని ధరించాడని పురాణ కథనం.
వికట అవతారం:
మమకారం, వ్యామోహం, మితిమీరిన స్వాధీనతకు ప్రతీకగా చెప్పే మమాసురుడిని అణచివేసేందుకు గణేశుడు విఘ్నరాజ రూపాన్ని ధరించాడని చెబుతారు.
విఘ్నరాజ అవతారం:
అహంకారాసురుడి అహంకారం, తానే గొప్ప అనే భావనను తొలగించేందుకు గణేశుడు ధూమ్రవర్ణ అవతారం ధరించాడని పురాణాల్లో పేర్కొంటారు.
ధూమ్రవర్ణ అవతారం:
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్