AP 10th Exams: పదో తరగతి పేపర్‌ లీకేజ్‌లకు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. మార్గదర్శకాలు విడుదల..

| Edited By: Ravi Kiran

May 04, 2022 | 5:07 PM

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్షలు మొదలైన నాటి నుంచి ఎక్కడో ఓ చోట ప్రశ్నా పత్రాల లీకేజ్‌కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పేపర్‌ లీకేజ్‌లకు...

AP 10th Exams: పదో తరగతి పేపర్‌ లీకేజ్‌లకు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. మార్గదర్శకాలు విడుదల..
Ap 10th Exams
Follow us on

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్షలు మొదలైన నాటి నుంచి ఎక్కడో ఓ చోట ప్రశ్నా పత్రాల లీకేజ్‌కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పేపర్‌ లీకేజ్‌లకు చెక్‌పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అధ్యాపక సిబ్బందికి టెక్నాలజీ వినియోగంపై మార్గదర్శకాలను విడుదల చేశారు. టెన్త్‌ పరీక్షలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్‌ జోన్‌లుగా ప్రకటించారు అధికారు. పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులుతో పాటు ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు అనే నిబంధన విధించారు. స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ ఫోన్లు, ఇయర్ పాడ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని అధికారులు తెలిపారు. అలాగే హోమ్ స్కూల్ స్టూడెంట్స్ కి వేరే సెంటర్లో అదే ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్‌గా ఉండకూడదనే నిబంధను విధించారు.

పరీక్షా కేంద్రంలోని మిగిలిన అన్ని ప్రశ్నా పత్రాలను సంబంధిత సూపరింటెండెంట్‌, డీఓ, ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేసిన పేపర్ సీల్‌ చేయాలని సూచించారు. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసిన వెంటనే క్వశ్చన్ పేపర్ పై స్టూడెంట్ రోల్ నంబర్,పరీక్షా కేంద్రం నంబర్‌ను వెంటనే రాయించాలనే నిబంధనను విధించారు. జిల్లా కలెక్టర్లు మెజిస్ట్రేట్‌ ఆదేశాలతో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల సంఖ్యను పెంచుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా మాల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న వారిపై ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 1997 యాక్ట్‌ 25 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు వీటిపై ప్రచారం కల్పించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులు సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: GT vs PBKS IPL 2022 Match: రబాడ దెబ్బకు గుజరాత్ విలవిల.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 144..

Big News Big Debate: నేపాల్‌లో రాహుల్‌ అడ్డంగా బుక్కయ్యారా.? కమలదళం కావాలనే రచ్చ చేస్తోందా.?

Shalini Pandey: స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్న ప్రీతీ.. షాలిని పాండే కు ఎట్రాక్ట్ అవుతున్న యూత్..