AP TRANSCOలో 200 AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.75 వేల జీతం

AP TRANSCO AEE Recruitment 2026: ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

AP TRANSCOలో 200 AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నెలకు రూ.75 వేల జీతం
AP TRANSCO AEE Recruitment

Updated on: Jun 25, 2026 | 6:00 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APTRANSCO) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 30, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వారీగా ఖాళీలు

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 167
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల సంఖ్య: 23 పోస్టులు
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలికాం) పోస్టుల సంఖ్య: 10 పోస్టులు

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 20, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్, పరీక్ష ఫీజుగా ప్రతి ఒక్కరూ రూ.1000 చొప్పున చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్‌ కాలంలో నెలకు రూ.75,000 కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)లో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. జోనల్ లోకల్ కేటగిరీ, రిజర్వేషన్ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రొబేషన్‌ పూర్తైన తర్వాత రెగ్యులర్ పే స్కేల్‌ ప్రకారం రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు జీతం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

AP TRANSCOలో 200 AEE ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us