APSACS YSR Kadapa Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలో (APSACS Kadapa) ఉన్న ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్ బ్యాంకులో.. ఒప్పంద ప్రాతిపదికన 16 మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ/ఏఆర్‌టీ కౌన్సెలర్, ఐసీటీసీ/బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఎంబీబీఎస్/బీఎస్సీ నర్సింగ్/పోస్టు గ్రాడ్యుయేషన్/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 31, 2022 నాటికి 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు ఆగస్టు 29, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
అడ్రస్: ADM&HO (A, L & TB), 2nd Floor, DM&HO Building, Akkayapalli, Kadapa, YSR District
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.