APPSC Results 2025: ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? సెలక్షన్‌ లిస్ట్‌ వచ్చేసింది.. లింక్ ఇదిగో!

రాష్ట్ర అటవిశాఖ ఇటీవల అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించిన..

APPSC Results 2025: ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? సెలక్షన్‌ లిస్ట్‌ వచ్చేసింది.. లింక్ ఇదిగో!
APPSC FBO and ABO Results

Updated on: Oct 10, 2025 | 7:03 AM

అమరావతి, అక్టోబర్‌ 10: ఆంధ్రప్రదేశ్‌ అటవిశాఖ ఇటీవల అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి రోల్‌ నెంబర్లను ఎమిషన్‌ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

కాగా రాష్ట్ర అటవీ శాఖలో మొత్తం 435 ఏబీఓ పోస్టులు, 256 ఎఫ్‌బీఓ పోస్టులు, 100 ఎఫ్‌ఎస్‌ఓ పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. స్క్రీనింగ్‌ పరీక్ష ఫలితాల్లో మొత్తం 13,845 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత మెడికల్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియేన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ అటవీ శాఖ ఉద్యోగాల ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో 3 రోజుల్లో బడులకు మెగా డీఎస్సీ కొత్త టీచర్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇందులో ఎంపికైన టీచర్ల పోస్టింగ్‌ల కోసం వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ కూడా నేటితో (అక్టోబరు 10) పూర్తి కానుంది. వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు పాఠశాల కేటాయింపు పత్రాలను జారీ చేస్తారు. వీటిని అక్టోబర్‌ 11న జారీ చేసే అవకాశం ఉంది. లేదంటే అక్టోబర్‌ 12న అందిస్తారు. దీంతో కొత్త టీచర్లు తమకు కేటాయించిన పాఠశాలకు అక్టోబర్‌ 13 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కొత్త టీచర్లకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయ్యింది. కాగా మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా 15,941 మందికి పోస్టులు కేటాయించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.