APCPDCL Job Notification: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

|

Apr 10, 2021 | 2:31 PM

APCPDCL Job Notification:ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. వరసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో..

APCPDCL Job Notification: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
Apcpdcl
Follow us on

APCPDCL Job Notification:ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. వరసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. APCPDCLలో మొత్తం 86 ఖాళీలున్నాయి. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలులో ఖాళీలున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. మే 3 తో ముగియనుంది.
ఇందుకు సంబంధించినపూర్తి వివరాలను https://apcpdcl.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంది. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులున్న యెడల వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. 2021 మే 10 వతేదీ నుంచి నుంచి మే 14తేదీ లోపున దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంది.

ఇక హాల్‌టికెట్స్ మే 18వ తేదీ 2021 నుంచి మే 22 వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక రాతపరీక్ష ను మే 23 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు. మే 23 ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. ఫలితాలను మే 31న ప్రకటించనున్నారు.

ఖాళీల వివరాలు :

జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 1 పోస్టులు – 86
విజయవాడ- 38
గుంటూరు- 13
సీఆర్‌డీఏ- 3
ఒంగోలు- 32

విద్యార్హతలు- 10వ తరగతి ఉత్తీర్ణత, ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్, రీవైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ పాస్ కావాలి.

ఎంపిక విధానం;

రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మీటర్ రీడింగ్
వేతనం:
నెలకు రూ.15,000.
వయస్సు:
2021 జనవరి 31 నాటికి 18 నుంచి 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సులో 5 ఏళ్లు సడలింపునిచ్చారు.

దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350.

Also Read: అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని బొప్పాయి..

ఇంట్లోనే రెస్టారెంట్ టెస్ట్ తో పన్నీర్ టిక్కా మసాలా తయారీ చేసుకోవడం ఎలా అంటే..!

 

 

.