AP Government Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో ఖాళీలకు నోటిఫికేషన్

|

Apr 08, 2021 | 11:08 AM

AP Government Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, బీటెక్ అర్హత కలిగి.. ప్రభుత్వం ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం.. ఏపీ ప్రభుత్వానికి..

AP Government Jobs:  నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో ఖాళీలకు నోటిఫికేషన్
Ap Water Resources Departme
Follow us on

AP Government Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, బీటెక్ అర్హత కలిగి.. ప్రభుత్వం ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం.. ఏపీ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను అర్హులైన అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

హైడ్రాలజిస్ట్‌-01
కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌-03
అకౌంటెంట్‌-01
డేటా ఎంట్రీ ఆపరేటర్‌-02.

హైడ్రాలజిస్ట్ కి విద్యార్హతలు:

బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం.. లేదా ఎంటెక్‌(వాటర్‌ రిసోర్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి.

వేతనం నెలకు రూ.56,000

విధులు నిర్వహించాల్సిన ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్ పోస్టులకు విద్యార్ధతలు

కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్‌ అనుభవం ఉండాలి.

వేతనం :
నెలకు రూ.24,500

పనిచేయాల్సిన ప్రదేశం: కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌.

అకౌంటెంట్‌ కు విద్యార్హత:

ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.17,500

పని చేయాల్సిన ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

డేటాఎంట్రీ ఆపరేటర్‌ కు అర్హత:

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వేతనం నెలకు రూ.15,000
పని చేయాల్సిన ప్రదేశం: చీఫ్‌ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఈమెయిల్‌: [email protected]

దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌: https://irrigationap.cgg.gov.in/wrd/home లాగిన్ అయ్యి తెలుసుకోవాలి.

Also Read: అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకు ఉంది.. ఎవరికి గెస్ట్ అని తండ్రిని నిలదీసిన హిమ..