AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు

AP universities Professor Recruitment 2026: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 279, రెగ్యులర్‌ పోస్టులు 1,244 వరకు..

AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు
AP University Faculty Recruitment

Updated on: May 16, 2026 | 2:03 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 279, రెగ్యులర్‌ పోస్టులు 1,244 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ఆర్టీయూకేటీలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో 125 పోస్టులు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 103 పోస్టులు చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు మే 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ప్రొఫెసర్‌ పోస్టుల సంఖ్య: 63
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సంఖ్య: 334
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సంఖ్య: 1020
  • అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టుల సంఖ్య: 02
  • లెక్చరర్‌(ఆర్‌జీయూకేటీ) పోస్టుల సంఖ్య: 104

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌లో ఉత్తీర్ణతతోపాటు యూజీసీ నెట్‌ లేదా ఏపీ ఎస్‌ఎల్‌ఈటీ లేదా సెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత వర్సిటీ అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 18, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8, 2026.
  • హార్డ్‌ కాపీతో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: జూన్‌ 15, 2026.
  • ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల: జూన్‌ 22, 2026.
  • ప్రాథమిక అర్హతపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 29, 2026.
  • తుది అర్హత జాబితా విడుదల: జూన్‌ 30, 2026.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్లు ఇవే..

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us