AP 10th Class Exam Question Papers Leaked: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ల లీక్‌పై ఏపీ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రారంభమైన పోలీస్ విచరణలో ఆక్రమాలు ఒక్కొక్కటిగా బయటపుడుతున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీక్ వెనక ప్రైవేట్ స్కూల్ మాఫియా హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (Ramakrishna English Medium School) ప్రమేయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ స్కూల్ తెలుగు టీచర్ లక్ష్మీ దుర్గ అరెస్ట్ చేయడంతో నిందితుల సంఖ్య 12 పెరిగింది. కాగా అరెస్టయినవారిలో ఏడుగురు తెలుగు టీచర్లు, ఇద్దరు ఫిజికల్ సైన్స్ టీచర్లు ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని డీఐజీ సెంథిల్కుమార్ తెలిపారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె హై స్కూల్, కొలిమిగుండ్ల పరిధిలోని హై స్కూల్ విద్యార్థులు అందరిని పాస్ చేయించాలని ఉద్దేశంతోనే క్వశ్చన్ పేపర్ లీకేజ్ (AP SSC Question Paper Leak)కి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ వ్యవహారంలో ముఖ్య సూత్రదారులుగా నారాయణ విద్యాసంస్థల సిబ్బంది పేర్లు తెరపైకొచ్చాయి. తిరుపతి నారాయణ కాలేజ్ (Tirupati Narayana College) నుంచే పేపర్ లీక్ అయ్యినట్టు, ఆ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. తిరుపతి ఎన్‌ఆర్‌ఐ కాలేజీ లెక్చరర్ సుధాకర్‌ను మరో నిందితుడిగా తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, లోతుగా విచారణ చేసే దిశగా
Also Read: