AP Schools: ఏపీలో 2022-23 విద్యాసంవత్సరానికి పాఠశాలల ప్రారంభం ఎప్పటినుంచంటే..

|

May 19, 2022 | 6:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు కొంత ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది జూన్‌లో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆనవాయితీ. ఐతే వచ్చే విద్యాసంవత్సరం మాత్రం..

AP Schools: ఏపీలో 2022-23 విద్యాసంవత్సరానికి పాఠశాలల ప్రారంభం ఎప్పటినుంచంటే..
Ap Schools Reopen
Follow us on

AP Schools reopening date 2022-23: ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు కొంత ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది జూన్‌లో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆనవాయితీ. ఐతే వచ్చే విద్యాసంవత్సరం మాత్రం ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రారంభంమైన సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని పరీక్షలు మే చివరి నాటికి పూర్తవుతాయి. పదో తరగతి పరీక్షల ఫలితాలు, ఇంటర్‌ ఫలితాలు, ఏపీ ఈఏపీసెట్‌ 2022 వంటి ఇతర పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తయితే కానీ బడులు తిరిగి తెరచుకోవు. దీంతో 2022-23 విద్యా సంవత్సరం జూలై 4 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం (AP Schools reopening) కానున్నాయి. అంతేకాకుండా కోవిడ్‌ మహమ్మారి కారణంగా 2021-22 విద్యా సంవత్సరం ఆగస్టు 16న ప్రారంభమయ్యింది. కుదించిన సిలబస్‌తో మొత్తం 188 పని దినాలతో అకడమిక్‌ క్యాలెండర్ రూపొందించారు. అందువల్లనే పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ఏపీ విద్యాశాఖ (AP Education department) త్వరలో విడుదల చేయనుంది

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.