AP Polycet 2021 Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే..

|

Sep 15, 2021 | 11:58 AM

AP Polycet 2021 Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలో గల ఏపీఐఐసీ కార్యాలయంలో..

AP Polycet 2021 Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే..
Results
Follow us on

AP Polycet 2021 Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలో గల ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాలిసెట్ – 2021 ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 68,138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో కల్లూరి రోషన్ – విశాఖపట్నం, కామారపు వివేక్ వర్ధన్ – పశ్చిమ గోదావరి 1 ర్యాంక్ సాధించారు. పాలిసెట్-2021 రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

కాగా, ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామన్నారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశ పెడుతున్నారని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపిస్తామని చెప్పారు.

Also read:

మృగాడ్ని పట్టుకుంటే రూ .10 లక్షల రివార్డు..రంగంలోకి వెయ్యి మంది పోలీసులు,70 టీమ్స్..(వీడియో).:Saidabad Horror Video.

Goat Farming: మేకల పెంపకంతో లక్షల్లో లాభాలు.. అయితే, ఈ కీలక సమాచారం తెలుసుకోవాల్సిందే..

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..