AP LAWCET 2026 Toppers: లాసెట్‌లో ‘టాప్’ లేపిన తిరుపతి కుర్రోడు.. టాపర్ల ర్యాంకులు, వారి మార్కులు చూశారా?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కాలేజీల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో మే 4న నిర్వహించిన ఏపీ లాసెట్ 26 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం (మే 18) రాత్రి విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ ఏడాది లాసెట్ పరీక్షలను నిర్వహించింది.
అమరావతి, మే 19: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23,996 మంది రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్, 3, 5 సంవత్సరాల బీఎల్/ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు హాజరవగా ఇందులో 19,197 మంది ఉత్తీర్ణత పొందారు. అంటే మొత్తం ఉత్తీర్ణత శాతం 80గా నమోదైందని తెలిపారు. లాసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక ద్వారా ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌ఎం/ ఎల్‌ఎం పరీక్షలో 904 మంది రాయగా 1752 మంది అంటే 92.02%, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 17,533 మంది రాయగా 13,863 అంటే 79.07%, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలో 4,559 మంది రాయగా 3,582 మంది 78.57% ఉత్తీర్ణత పొందారు. ఇతర పూర్తి వివరాలకు 9552300009 నంబరు సంపద్రించవచ్చు.