AP Inter Supply 2024 Exam Fee: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు ఇవే.. ఏప్రిల్‌ 24తో ముగుస్తోన్న గడువు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఏప్రిల్ 12 (శుక్రవారం) విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి పూర్తి చేశారు. మొత్తం 9,99,698 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఫెయిల్‌ అయిన విద్యార్ధులు..

AP Inter Supply 2024 Exam Fee: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు ఇవే.. ఏప్రిల్‌ 24తో ముగుస్తోన్న గడువు
AP Inter Supply 2024 Exams

Updated on: Apr 14, 2024 | 3:42 PM

అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఏప్రిల్ 12 (శుక్రవారం) విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి పూర్తి చేశారు. మొత్తం 9,99,698 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్ధులకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్షల తేదీలతోపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు కూడా అవకాశం ఇచ్చింది.

మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిష్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌కు ప్రయత్నించే విద్యార్ధులు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. అలాగే సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ జరుగుతాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు తాజాగా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు వెల్లడించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్‌ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆన్సర్ షీట్ రీ-వెరిఫికేషన్‌కు రూ.1300, ఆన్సర్ షీట్ రీ-కౌంటింగ్‌కు రూ.260 ఫీజుగా బోర్డు నిర్ధారించింది. థియరీకి సంబంధించి ఒక్కో సతెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 4,61,273 మంది పరీక్షలకు విద్యార్థులు హాజరవగా, వారిలో 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో మొత్తం 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, వీరిలో 3,06,528 మంది ఉత్తీర్ణత పొందారు. ఇక ఒకేషనల్ ఫస్ట్ ఇయర్‌లో 38,483 మంది పరీక్షలకు హాజరవగా, వారిలో 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది హాజరవగా, 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా తొలి స్థానం, గుంటూరు రెండో స్థానం, ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.