AP Inter Results 2025 Highlights: ఒక్క క్లిక్‌తో ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్స్ట్ ఐడీ ఇదిగో..

Andhra Pradesh Intermediate Board Results 2025 Updates: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను టీవీ9 వెబ్ సైట్, ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లలో అత్యంత వేగంగా చూడొచ్చు.

AP Inter Results 2025 Highlights: ఒక్క క్లిక్‌తో ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్స్ట్ ఐడీ ఇదిగో..
Ap Inter Results

Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 12, 2025 | 3:10 PM

సమయం రానే వచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఏపీ విద్యార్ధులకు.. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేయనున్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా అత్యంత వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. మీరు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే మిత్ర వాట్స్ యాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌ పెట్టినా.. ఫలితాలు మీకు సులువుగా అందుతాయి. కాగా, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి.

రిజల్ట్స్ లింక్..

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2025 12:10 PM (IST)

    ఇంటర్ రిజల్ట్స్ ఇలా

    ఇది గత 10 ఏళ్లలో అత్యధికం.

    1వ సంవత్సరం పాస్ శాతం 47%గా ఉంది —

    ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధిక శాతం.

    ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్లు, ప్రతీ ఒక్కరి కృషికి ఉదాహరణ

    ఈసారి విజయాన్ని సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి.మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగివచ్చేలా ప్రయత్నించండి.

    పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను.

    మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాలను సాధిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

  • 12 Apr 2025 11:50 AM (IST)

    ఇంటర్ ఫలితాలు ఇలా

    ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతం తో మొదటి స్థానం లో ఉండగా 73 శాతంతో చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ఫలితాల్లో గణనీయమైన వృద్ధి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2వ సంవత్సరం పాస్ శాతం 69% కి చేరింది.


  • 12 Apr 2025 11:27 AM (IST)

    ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత, సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత

    — ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.

    — ఫలితాలు విడుదల చేశారు మంత్రి నారా లోకేష్‌

    — ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత

    — ఇంటర్‌ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత

    — రాష్ట్రవ్యాప్తంగా సీనియర్, జూనియర్ ఇంటర్ కలిపి మొత్తం 10 లక్షల 17 వేల102 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు

    — ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్.. మన మిత్ర వాట్సప్ యాప్‌లో ఫలితాలు పొందవచ్చన్నారు.

  • 12 Apr 2025 11:26 AM (IST)

    ఇంటర్ ఫలితాలు ఇదిగో..

  • 12 Apr 2025 11:00 AM (IST)

    రిజల్ట్స్ విడుదల..

    ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫలితాలు రిలీజ్ చేశారు. మీరు ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లు, టీవీ9 వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

     

  • 12 Apr 2025 10:57 AM (IST)

    రిజల్ట్స్ చెక్ చేసుకునే వెబ్ సైట్లు

    AP ఇంటర్ మార్కుల మెమోను కింద ఇచ్చిన ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025

  • 12 Apr 2025 10:53 AM (IST)

    రిజల్ట్స్ చూసుకోండి ఇలా

    ముందుగా అధికారిక వెబ్‌సైట్ results.gov.in లేదా results.bie.ap.gov.in లోకి వెళ్లండి. అక్కడ రిజల్ట్స్ ట్యాబ్ ఎక్కడ ఉందో చూసి, క్లిక్ చెయ్యండి. మీ వివరాలు ఇవ్వండి. ఆ తర్వాత సబ్‌మిట్ కొట్టగానే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అనంతరం వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీయండి.

  • 12 Apr 2025 10:13 AM (IST)

    ఇంటర్ ఫలితాలు మరికొన్ని గంటల్లో

    మీరు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే మిత్ర వాట్స్ యాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌ పెట్టినా.. ఫలితాలు మీకు సులువుగా అందుతాయి.

  • 12 Apr 2025 09:35 AM (IST)

    మరికొన్ని గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు

    విద్యార్ధులు, తల్లిదండ్రులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా అత్యంత వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆ లింక్ కింద ఇచ్చాం..

    టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు 2025  కోసం క్లిక్‌ చేయండి.

  • 12 Apr 2025 09:09 AM (IST)

    మరికొన్ని గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు

    — నేడు ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు

    — ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖామంత్రి లోకేష్

    — రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి హాజరైన 10లక్షల17వేల102 మంది విద్యార్దులు

    — మన మిత్ర వాట్సప్ యాప్ లోనూ అందుబాటులో ఫలితాలు

    — ఎలాంటి ఆర్బాటం లేకుండా Xలోనే ఫలితాలు విడుదల

    — tv9telugu.com వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఫలితాలు