AP Inter Original Memos 2023: ఇంటర్మీడియట్‌ ఒరిజినల్‌ మెమోలు ఇంకా జారీ చేయని ఏపీ ఇంటర్‌ బోర్డు.. ఆందోళనలో విద్యార్ధులు

|

Oct 05, 2023 | 8:45 PM

రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రతిఒక్కరినీ విస్తుగొలుపుతోంది. ఇంటర్మీడియట్‌ 2023 ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు జారీ చేయకపోవడం చర్చణీయాంశంగా మారింది. ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగియడంతో అయా విద్యాసంస్థలు ఒరిజినల్‌ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయంటూ మొరపెడుతున్నారు. చేసేదిలేక కొందరు..

AP Inter Original Memos 2023: ఇంటర్మీడియట్‌ ఒరిజినల్‌ మెమోలు ఇంకా జారీ చేయని ఏపీ ఇంటర్‌ బోర్డు.. ఆందోళనలో విద్యార్ధులు
AP Inter Board
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 5: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రతిఒక్కరినీ విస్తుగొలుపుతోంది. ఇంటర్మీడియట్‌ 2023 ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు జారీ చేయకపోవడం చర్చణీయాంశంగా మారింది. ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగియడంతో అయా విద్యాసంస్థలు ఒరిజినల్‌ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయంటూ మొరపెడుతున్నారు. చేసేదిలేక కొందరు విద్యార్థులు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి వచ్చి అధికారుల వద్ద త్వరలోనే మెమోలు ఇస్తామని లేఖలు తీసుకొని వెళ్తున్నారు.

సాధారణంగా ప్రతి యేటా ఆగస్టులోనే ఒరిజినల్‌ మెమోలు జారీ చేస్తుంది. అయితే ఈ ఏడాది ముద్రణకు ఇచ్చేందుకే ఇంటర్మీడియట్‌ బోర్డు చాలా సమయం తీసుకుంది. మెమోల ముద్రణకు విద్యార్థుల నుంచే ఫీజుల రూపంలో డబ్బు కూడా వసూలు చేసింది. అయినప్పటికీ సకాలంలో విద్యార్థులకు మొమోలు అందించలేకపోయింది. విద్యార్థులకు మెమోలు ఇప్పించాలని, ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు సొంత రాష్ట్రానికి వచ్చి వెళ్లడం కష్టంగా మారిందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది.

కేయూ పరిధిలోని డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో 2017 కంటే ముందు ఇయర్‌వైజ్‌ స్కీంలో ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 9 నుంచి నవంబరు 14 వరకు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్‌ నవంబరు 15 నుంచి 21వ తేదీ వరకు, ఇంటర్న్‌ పరీక్షలు నవంబర్‌ 22, 23 తేదీల్లో జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ పి మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

అంబేడ్కర్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశ గడువు పెంపు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ డిప్లొమాతోపాటు పలు సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి తుది గడువు అక్టోబర్‌ 20వ తేదీ వరకు పొడిగించారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఏంఎల్‌ఐఎస్సీతో పాటు సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో లో చెక్‌ చేసుకోవచ్చన్నారు లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌ 18005990101 లేదా హెల్ప్‌ డెస్క్‌ నంబర్లకు 7382929570 /580 ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.