AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు.. టీవీ9 వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి

|

Apr 12, 2024 | 11:26 AM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 12) విడుదల కానున్నాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు..

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు.. టీవీ9 వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి
AP Inter Results
Follow us on

అమరావతి, ఏప్రిల్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 12) విడుదల కానున్నాయి. తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు అధికారులు.. ఫలితాలకు సంబంధించిన అంతర్గత ప్రాసెస్‌ను కూడా కంప్లీట్ చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్ధులు 5,17,617 మంది ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్‌ విద్యార్ధులు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 52,900 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.