AP ICET 2022: ఏపీ ఐసెట్ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 11:52 AM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (AP ICET - 2022) నోటిఫికేషన్‌ గురువారం (మే 26) విడుదలైంది. ఈ ఏడాది కూడా..

AP ICET 2022: ఏపీ ఐసెట్ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
Apicet 2022
Follow us on

AP ICET 2022 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (AP ICET – 2022) నోటిఫికేషన్‌ గురువారం (మే 26) విడుదలైంది. ఈ ఏడాది కూడా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) ఏపీ ఐసెట్‌ 2022 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 10 వరకు కొనసాగనున్నాయి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రూ.650లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌ చేసుకోవడానికి జూలై 11 నుంచి జూన్‌ 13 వరకు అవకాశం కల్పించనున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జూలై 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏపీ ఐసెట్‌ 2022 జరగనుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు, 200ల మార్కుల చొప్పున..రెండున్నర గంటల పాటు పరీక్ష జరుగుతుంది. పరీక్ష అనంతరం జూలై 27న ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదలవుతుంది. ఆగస్టు 8న ఫలితాలు ప్రకటిస్తారు.

ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో మేథమెటిక్స్‌ సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. దూరవిద్య విధానంలో డిగ్రీ చేసినవారు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన/ రాస్తున్న/ రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఏపీ ఐసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ ఏడాది కల్పిస్తున్నారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.