AP High Court Jobs 2026: రూ.లక్ష 50 వేల జీతంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు 20, బదిలీ ద్వారా 12 పోస్టులను..

AP High Court Jobs 2026: రూ.లక్ష 50 వేల జీతంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!
AP High Court Court Master Recruitment

Updated on: Mar 24, 2026 | 7:35 AM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్ట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు 20, బదిలీ ద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 17, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 180 పదాలు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో టైప్ చేయగలగాలి. లేదా 150 డబ్ల్యూపీఎం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషానికి 45 పదాల వేగంతో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 19, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అనంతరం నింపిన దరఖాస్తు ఫారాలను పోస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు పత్రంతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా ఉంచాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చొప్పున తప్పనిసరిగా చల్లించాలి. రాత పరీక్ష (షార్ట్‌హాండ్‌ డిక్టేషన్, కంప్యూటర్లలో ట్రాన్స్‌క్రిప్షన్) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కోర్ట్‌మాస్టర్‌, పర్సనల్‌ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us