AP EAPCET 2022 Key: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ కీ పేపర్‌ను అధికారులు విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించిన ఆన్సర్ కీ పేపర్‌ను మంగళవారం (12-07-2022) విడుదల చేయగా, అగ్రికల్చర్ స్ట్రీమింగ్‌కు సంబంధించి కీ పేపర్‌ను బుధవారం (13-07-2022) విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చవని అధికారులు తెలిపారు.
ఆన్సర్ కీ లో ఏవైన అభ్యంతరాలు ఉంటే ఇంజనీరింగ్ విభాగంగ వారు 14-07-2022 సాయంత్రం 5 గంటల లోపు, అగ్రికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు 15-07-2022 తేదీన ఉదయం 9గంటలలోపు నివేదించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2022) జూలై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్, 11వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఏపీలో 120, తెలంగాణలో 2 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. ఏపీ ఈఏపీసీఈటీలో సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..