AP Anganwadi Jobs: టెన్త్, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు

|

Sep 25, 2024 | 3:15 PM

అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు..

AP Anganwadi Jobs: టెన్త్, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు
AP Anganwadi Jobs
Follow us on

అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తికలిగిన మహిళా అభ్యర్ధులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 84 పోస్టులను భర్తీ చేస్తారు. అనంతపురం అర్బన్‌లో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంత గ్రామీణంలో 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణదుర్గం 6, కణేకల్లు 5, కంబదూరు 7, రాయదుర్గంలో 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా గ్రామాల పరిధిలో ఎక్కడికక్కడ సీడీపీఓలు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులకు 1 అక్టోబరు, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

పోస్టుల వివరాలు..

  • అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు: 9
  • అంగన్‌వాడీ మినీ కార్యకర్త పోస్టులు: 4
  • అంగన్‌వాడీ సహాయకుల పోస్టులు: 71

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులకు 10వ తరగతి, 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతలు, రిజర్వేషన్‌ రోస్టర్, స్థానికత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపికైన వారికి నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు రూ.7000 చొప్పున జీతం చెల్లిస్తారు. ఆఫ్‌లైన్‌ విధానంలో మాత్రమే దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.