APSCSCL Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల సంస్థలో 4,033 ఒప్పంద ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే పోస్టింగ్‌..

|

Sep 08, 2023 | 5:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిదికన 4,033 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఖరీఫ్‌ 2023-24 సీజన్‌ వరి సేకరణ సేవలకు సంబంధించి రెండు నెలల వ్యవధికి గానూ ఈ పోస్టులను కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు..

APSCSCL Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల సంస్థలో 4,033 ఒప్పంద ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే పోస్టింగ్‌..
AP Civil Supplies Corporation
Follow us on

అమరావతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిదికన 4,033 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఖరీఫ్‌ 2023-24 సీజన్‌ వరి సేకరణ సేవలకు సంబంధించి రెండు నెలల వ్యవధికి గానూ ఈ పోస్టులను కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. తాజాగా విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్‌, అనకాపల్లి జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

ఈ నోటిఫికేషన్ల ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదని, కేవలం విద్యార్హతలు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఆధారంగానే ఈ పోస్టుల నియామక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లలో స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్గును బట్టి పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు. టీఏ, డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. హెల్పర్‌ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆయా జిల్లాల కేంద్రాల్లోని ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌ కార్యాలయాల్లో నింపిన దరఖాస్తులను సమర్పించాలని పౌర సరఫరాల సంస్థ తన ప్రకటనలో తెల్పింది.

సెప్టెంబ‌రు 8 నుంచి తెలంగాణ ఐసెట్‌ 2023 వెబ్‌ ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 245 కాలేజీల్లో మొత్తం 22,843 ఎంబీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 47 కాలేజీల్లో 3,042 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐసెట్-2023లో ర్యాంకు సాధించిన అభ్యర్ధులకు ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ చేసేందుకు వెబ్‌ఆప్షన్లు నమోదు ప్రక్రియ నేటి (సెప్టెంబ‌రు 8) ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు అభ్యర్థులు వెబ్‌ అప్షన్లు ఇచ్చుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ సూచించారు. సెప్టెంబ‌రు 8 నుంచి 12 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.