AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది వెబ్‌సైట్‌ లింకుల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి..

AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్‌ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల! డౌన్‌లోడ్ లింక్ ఇదే
AP CETs Hall Tickets

Updated on: Apr 29, 2026 | 7:55 AM

అమరావతి, ఏప్రిల్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల మొదటి వారం నుంచి వరుసగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్లను (అడ్మిట్ కార్డులను) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ప్రవేశ పరీక్షల అడ్మిట్ కార్డుల 2026 డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏ పరీక్ష ఏ తేదీనంటే?

  • ఏపీ లాసెట్‌ 2026 పరీక్ష శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 4న జరగనుంది. మే 7న కీ, మే 18న ఫలితాలు విడుదలవుతాయి.
  • ఏపీ ఎడ్‌సెట్‌ 2026 పరీక్ష మే 8న ద్రవిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మే 12న కీ, మే 26న ఫలితాలు ప్రకటిస్తారు.
  • ఏపీ పీజీసెట్‌ 2026 పరీక్ష మే 8 నుంచి 11 వరకు ఎస్వీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • ఏపీ ఐసెట్‌ 2026 పరీక్ష మే 2న ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మే 5న కీ, మే 16న ఫలితాలు వెల్లడిస్తారు.
  • ఏపీ పీజీఈసెట్‌ 2026 పరీక్ష ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తోంది. మే 6న కీ, మే 14న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
  • ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగనున్నాయి.

ఏపీ ప్రవేశ పరీక్షల అడ్మిట్ కార్డుల 2026 డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us