ANGRAU Recruitment 2022: నెలకు రూ.54,000ల జీతంతో.. బాపట్ల అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు..

|

Jun 01, 2022 | 5:46 PM

చార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి చెందిన బాపట్లలోని బాక్టర్‌ ఎన్టీఆర్‌ కాలాజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ అసోసియేట్ పోస్టుల (Teaching Associate Posts) భర్తీకి..

ANGRAU Recruitment 2022: నెలకు రూ.54,000ల జీతంతో.. బాపట్ల అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు..
Angrau
Follow us on

ANGRAU Bapatla Recruitment 2022: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి చెందిన బాపట్లలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ కాలాజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ అసోసియేట్ పోస్టుల (Teaching Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: టీచింగ్‌ అసోసియేట్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1
  • మెకానికల్ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1
  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికట్చరల్‌ ఇంజనీరింగ్‌, బాపట్ల, గుంటూరు, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

India-Australia FTA 2022: భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం ముఖ్యాంశాలివే! 5-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు..