
ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుండి జూన్ 4 వరకు నిర్వహించనుంది. మే 1 నుండి మే 9 వరకు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా పరీక్ష రుసుము చెల్లించవచ్చు. ఒకే ఒక్క విఫలం జీవితాన్ని నిర్ణయించదని, మరింత పట్టుదలతో చదివి విజయం సాధించాలని నిపుణులు అంటున్నారు.
వాట్సాప్ నంబర్ 95523 00009 కి కేవలం ఒక మెసేజ్ పంపి, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా సులభంగా మార్కులు తెలుసుకోవచ్చు. LEAP యాప్ ద్వారా కూడా పేరెంట్స్ తమ పిల్లల రిజల్ట్స్ తెస్లుసుకోవచ్చు.
రాష్ట్రంలోనే 96.07 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కృషి ఫలించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పట్టణ విద్యార్థులకు ధీటుగా రాణించి ఈ ఘనత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,089 పాఠశాలలు ఈ పరీక్షల్లో పాల్గొనగా, ఈ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. 87.90 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే 5.22 శాతం మెరుగైన ప్రదర్శన కనబరిచారు. విద్యారంగంలో బాలికల ఎదుగుదలకు ఈ ఫలితాలు ఒక నిదర్శనం. ప్రతీ సబ్జెక్టులోనూ, ముఖ్యంగా సెకండ్ లాంగ్వేజ్‌లో 99.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ఉత్తీర్ణత సాధించిన 5,26,954 మందిలో 83.69 శాతం మంది ఫస్ట్ డివిజన్ సాధించడం వారి కష్టానికి నిదర్శనం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు సాధించిన ఈ విజయం అభినందనీయం.
రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఎగ్జామ్ ఫీజును మే 1 నుంచి 9 వరకు చెల్లించవచ్చునని తెలిపింది. రూ. 50 లేట్ ఫితో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది. రీకౌంటింగ్(సబ్జెక్ట్‌కు రూ. 500), రీవెరిఫికేషన్(సబ్జెక్ట్‌కు రూ. 1000) కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చునని తెలిపింది.
ఏపీ పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 4.11 శాతం పాస్ పర్సంటేజ్ అధికంగా వచ్చింది. ఇక ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. అమ్మాయిలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 82.68 శాతం పాస్ అయ్యారు.
— ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
— మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఫలితాల విడుదల
— పరీక్షలు రాసిన 6 లక్షల 30వేల మంది విద్యార్థులు
— ఏపీ పదో తరగతిలో 85.25శాతం ఉత్తీర్ణత
— పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
— బాలికల ఉత్తీర్ణత 87.90 శాతం
— బాలుర ఉత్తీర్ణత 82.68 శాతం
— www.tv9telugu.comలోనూ టెన్త్ ఫలితాలు
గతేడాది (2025) ఏపీ పదో తరగతి ఫలితాల్లో 81.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 78.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం మరికాస్త పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధకారులు భావిస్తున్నారు.
మీ ఫోన్ లో 55352 లేదా 56300 నంబర్‌కు.. SSC Roll l Number అని టైప్ చేసి పంపండి. అనంతరం వెంటనే స్క్రీన్ పై మార్కులు కనిపిస్తాయి.
ఈ రోజు (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ విధానంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా పదో తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగింది. దాదాపు 15 రోజుల పాటు మార్కుల ఎంట్రీ ప్రాసెస్ కొనసాగింది. నెల రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. గతేడాది ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించారు. ఈ సారి కాస్త ఆలస్యంగా ఏప్రిల్ నెలాఖరుకు విద్యాశాఖ ఫలితాలు ప్రకటిస్తుంది. మూల్యాంకనంలో మార్కుల ఎంట్రీకి ట్యాబ్ సిస్టమ్ తీసుకురావడమే ఇందుకు కారణం.
మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్, లీప్ యాప్ ద్వారా కూడా నేరుగా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ కి ‘Hi’ అని మెసేజ్ పంపించి.. అనంతరం పదో తరగతి ఫలితాలు ఆప్షన్ ఎంచుకుని.. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వెంటనే స్క్రీన్ పై మార్కులు ప్రత్యక్షమవుతాయి.
అమరావతి, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈ రోజు (ఏప్రిల్ 30) గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నేరుగా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్, లీప్ యాప్ ద్వారా కూడా నేరుగా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
🚨 SSC Public Examinations, March 2026 Results are now live 🚨
Students can access their results through:
• Official Portal: https://t.co/jyZPaxr5Q9
• Mana Mitra (WhatsApp Governance): Send “Hi” to 9552300009
• LEAP Mobile Application
• DigiLocker
Results are also available…— Lokesh Nara (@naralokesh) April 30, 2026